AP EAMCET 2020 ONLINE MOCK TEST, REGISTER, LOGIN, WRITE EXAM, RESULTS

AP EAMCET ONLINE MOCK TEST 2020



ఏపీ ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ గారు తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ టెస్ట్‌ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ జులై 19న మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుందని తెలిపారు. 
ఎంసెట్‌ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు.
మరుసటి రోజున జులై 20న ఫలితాలు వెల్లడిస్తారన్నారు. 
ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. 
విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. 
ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు 

www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Post a Comment

1 Comments