AP లో నిరుద్యోగులకు శుభవార్త || 1113 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో ఉద్యోగ కానుక అందజేసింది. ఈసారి పబ్లిక్ హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు శనివారం (నవంబరు 16న ) 1,113 మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ ఖాళీలను భర్తీచేయనున్నారు. జోన్ల వారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు:
* మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు
ఖాళీల సంఖ్య: 1113
కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.
అర్హత: బీఎస్సీ (నర్సింగ్) డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
ఎంపిక విధానం:
- రాతపరీక్ష ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నారు.
- ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబరు 10న ఆన్లైన్ పరీక్ష నిర్వహించనున్నారు.
- విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
పరీక్ష విధానం:
- ఆన్లైన్ విధానంలో నిర్వహించే ఈ పరీక్షలో మొత్తం 200 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.
- బీఎస్సీ(నర్సింగ్) సిలబస్ నుంచే ప్రశ్నలు అడుగుతారు.
- పరీక్ష సమయం 3 గంటలు.
- పరీక్షకు సంబంధించిన హాల్‌టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు.
- పరీక్షకు హాజరయ్యేవారు హాల్‌టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపుకార్డును వెంటతీసుకెళ్లాల్సి ఉంటుంది.
- పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 50%, దివ్యాంగులకు 45%, ఎస్సీ-ఎస్టీలకు 40% గా నిర్ణయించారు.
శిక్షణ ఇలా:
రాతపరీక్షల్లో అర్హత సాధించినవారికి ఆరునెలల శిక్షణ నిర్వహించనున్నారు.వచ్చే ఏడాది జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం ప్రారంభంకానుంది.
శిక్షణ విజయవంతంగా పూర్తిచేసిన వారికి రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియమించనున్నారు.
వేతనం:
ఉద్యోగాలకు ఎంపికైనవారికి వేతనంగా నెలకు రూ.25,000 అందజేస్తారు.NOTE :శిక్షణ సమయంలో ఎలాంటి స్టైపెండ్ చెల్లించరు.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 16.11.2019.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 29.11.2019.
ప్రవేశ పరీక్షతేది: 10-12-2019 from 2:30 p.m. to 5:30 p.m.
బ్రిడ్జ్ కోర్సు కౌన్సెలింగ్: 23.12.2019.
బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం: 01.01.2020.

2 Comments
రిజిస్టర్ నంబర్ నర్సింగ్ ది ఇవ్వాళ? లేక మిడ్వైఫరీ ది ఇవ్వాళ?
ReplyDeleteKoncham clarity ga cheppandi
ReplyDelete