AP EAPCET Result 2021
EAPCET: ఈఏపీసెట్ (ఎంసెట్) 2021 ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నిర్వహించిన ఏపీ ఎంసెట్-2021 (ఈఏపీసెట్) ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇంజనీరింగ్‌కు సంబంధించి విజయవాడలో బుధవారం ఫలితాలు విడుదల చేశారు. 1,34,205 మంది విద్యార్థులు అర్హత సాధించారని తెలిపారు. దాదాపు 80 శాతం మంది అర్హత సాధించారని వెల్లడించారు. ఈ పరీక్షలో నిఖిల్ (అనంతపురం) మొదటి ర్యాంకు సాధించగా, మహంత నాయుడు (శ్రీకాకుళం) రెండు ర్యాంకు సాధించాడు. కాగా విద్యార్థులు రేపటి నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అగ్రి, ఫార్మా ఫలితాలు ఈ నెల 14న ప్రకటిస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
విద్యార్థులు ఫలితాలను ఇక్కడ
లో చుడొచ్చు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ తదితర కోర్సులకు గతంలో ఏపీ ఎంసెట్ పేరుతో నిర్వహించేవారు. అయితే మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయించారు. మెడికల్‌ను తొలగించడంతో ఏపీ ఎంసెట్‌ను ఏపీ ఈఏపీసెట్ (ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించారు. ఇంజనీరింగ్ స్ట్రీమ్‌కు సంబంధించి ఆగస్టు 20, 23, 24, 25వ తేదీల్లో రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు.
EAPCET: ఏపీ ఎంసెట్(ఈఏపీసెట్ - అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్) ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంసెట్ (ఈఏపీసెట్) ఫలితాలను సెప్టెంబర్ 14న విడుదల చేశారు..
ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మంగ్లవారం ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.
అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్ నిర్వహించేవారు. మెడికల్ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్’ నిర్వహిస్తుండటంతో మెడికల్ విభాగాన్ని ఎంసెట్ నుంచి మినహాయిం చారు. మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్ ను ఏపీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్)–2021 పేరుతో నిర్వహించారు. వీటి ఫలితాలను విడుదల చేసారు.
రాష్ట్రంలోని అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఏపీఈఏపీ సెట్ బైపీసీ స్ట్రీమ్ ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. మంగళగిరిలోని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 92.85 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 80.62 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు.
Check Yours EAPCET AGRICULTURE & PHARMACY Results Now:
Check Yours EAPCET ENGINEERING Results Now:
0 Comments