SSC GD Constable 2021: టెన్త్‌ క్లాస్‌తో 25,271 పోలీస్‌ జాబ్స్‌.. అప్లికేషన్‌ ప్రక్రియ ప్రారంభం

 నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌. అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) కానిస్టేబుల్‌ (జనరల్‌ డ్యూటీ)-2021 నోటిఫికేషన్‌ విడుదలైంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఈ నోటిఫికేషన్‌ ద్వారా 25, 271 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో 22,424 పోస్టులు.. మహిళలకు 2847 పోస్టులున్నాయి.

సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీసు ఫోర్స్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ, సెక్రటేరియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, రైఫిల్‌మెన్‌ ఇన్‌ అసోం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్ల నియామకానికి ఎస్‌ఎస్‌ఎసీ‌ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేస్తుంది. పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

దరఖాస్తుకు డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. ఇక్కడ క్లిక్‌ చేయండి:

మొత్తం ఖాళీలు: 25, 271

  • BSF - 7545
  • CISF - 8464
  • SSB - 3806
  • ITBP - 1431
  • AR - 3785
  • SSF - 240
  • వేతనం: ఎంపికైన అభ్యర్థులకు రూ.21,700 నుంచి రూ.69,100 వరకు ఉన్న గ్రేడ్‌ 3 స్థాయి వేతనం లభిస్తుంది
  • ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (Online Written Examination), ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్ (Physical Standards Test)‌, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, వైద్య పరీక్ష (Physical Efficiency Test and Medical Examination)ల ఆధారంగా అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.

ఇక ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు. జనరల్‌ ఇంటలిజెన్స్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవర్‌నెస్‌, ఎలిమెంటరీ మాథమెటిక్స్‌, ఇంగ్లీష్‌ లేదా హిందీపై ప్రశ్నలు ఉంటాయి. పూర్తి వివరాలకు ఎప్పటికప్పుడుhttps://ssc.nic.in/ వెబ్‌సైట్‌ చెక్‌ చేసుకుంటూ ఉండాలి.

ముఖ్యమైన తేదీలు:

  • దరఖాస్తులు ప్రారంభం: జులై 17, 2021
  • దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 31, 2021
  • దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరితేది: సెప్టెంబర్‌ 2, 2021
  • సీబీటీ పరీక్ష తేదీ: త్వరలో ప్రకటిస్తారు.
  • వెబ్‌సైట్‌:https://ssc.nic.in/


నోటిఫికేషన్‌:

 SSC GD constables notification 2021

Post a Comment

0 Comments