YSR Bhima Scheme Details Eligibility Amount Full Details in Telugu 2020

 YSR Bhima Details In Telugu

YSR Bhima, YSR Bhima Details, YSR Bhima Scheme in telugu, YSR Bhima Scheme Amount, Ysr Bhima Eligibilty in telugu, YSR Bhima Death Claim All Details.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సంక్షేమ పథకాల పరిధిలో మరో పథకం వచ్చి చేరింది. దీనివల్ల మన కుటుంబంలో లేదా ఎవరి కుటుంబం అయినా సరే కుటుంబం యొక్క పెద్ద మరణించినట్లయితే అది సహజ మరణం అయినా ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం కలిగినా పాక్షిక అంగవైకల్యం కలిగినా  ఈ పథకం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు కొత్తగా సహజంగా మరణించినా  కూడా ఈ పథకం ద్వారా ఆదుకునేలా ఈ పథకాన్ని రూపుదిద్దారు. ఈ పథకం పేద కుటుంబాలకు పూర్తిస్థాయిలో ఆసరా  చూపిస్తుంది. ఏపీ ప్రభుత్వం రూపొందించిన ఈ వైయస్సార్ బీమా తో రాష్ట్రంలో  1.50 కోట్లు మందికి లబ్ధి చేకూరే విధంగా ఏపీ ప్రభుత్వం ఈ పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదించింది.   బియ్యం కార్డు కలిగి ఉండి కుటుంబం ఆధారపడ్డ వ్యక్తి కనుక ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు  ఉద్దేశించిన ఈ వైయస్సార్ బీమా పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గారు అధ్యక్షతన బుధవారం మంత్రి వర్గం ఆమోదించింది. అయితే గతంలో ఎల్ఐసి తో కలిసి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేది. అయితే దీనిని  కొంతకాలం క్రితం ఉపసంహరించుకుంది. దీంతో పేదలకు ప్రయోజనం కల్పించే ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో సొంత నిధులతో అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో 1.50 కోట్ల బియ్యం కార్డు ఉన్న కుటుంబాలకు ప్రయోజనం కల్పించే ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి  రూ. 583.50 కోట్లు ఖర్చు చేయనుంది. 

బియ్యం కార్డు కలిగి  కుటుంబం ఆధారపడే 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యలో ఉన్న వ్యక్తి సహజ మరణం పొందితే బాధిత కుటుంబానికి 2 లక్షల భీమ పరిహారం ఇస్తారు. శాశ్వత వైకల్యం లేదా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇస్తారు. పాక్షిక వైకల్యం కలిగితే 2.5 లక్షలు ఇస్తారు. 
అలాగే 51 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు కలిగిన వ్యక్తి కనుక సహజ మరణం పొందితే  ఆ బాధిత కుటుంబానికి  30 వేల రూపాయలు ఇస్తారు. అలాగే  శాశ్వత వైకల్యం పొందిన ప్రమాదవశాత్తు మరణించినా 5 లక్షలు ఇస్తారు. పాక్షిక వైకల్యం కలిగితే 2.5 లక్షలు ఇస్తారు. 
బియ్యం కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ పథకానికి అర్హులే. ఈ పథకం కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు ప్రమాదాలు జరిగినప్పుడు లేదా కుటుంబ పెద్ద మరణించినప్పుడు బియ్యం కార్డు తీసుకెళ్లి గ్రామ సచివాలయం లో కలిస్తే చాలు మీకు రావాల్సిన డబ్బులు మంజూరు చేస్తారు.



Post a Comment

0 Comments