తెలంగాణాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు

తెలంగాణాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు



తెలంగాణాలో ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని విద్యాశాఖ తెలిపింది. ఫెయిల్ అయిన విద్యార్థులంతా పాస్ అయినట్లుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. కంపార్ట్మెంట్ లో పాస్ అయినట్లుగా సర్టిఫికెట్లో బోర్డు పేర్కొననుంది. ఈ నిర్ణయం తో  1.47 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుంది. రీ-కౌంటింగ్ , రీ-వెరిఫికేషన్ ఫలితాలను 10 రోజుల్లో విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సబితా ఇంద్ర రెడ్డి గారు వివరాలు వెల్లడించారు. . 

Post a Comment

0 Comments