వసతి దీవెన డబ్బు జమ || Jagananna Vasathi Deevena Money Credited to Bank Accounts
విజయనగరం: జిల్లా కేంద్రంలోని అయోధ్య మైదానంలో వసతి దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు.. బటన్ నొక్కి వసతి దీవెన మొత్తాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ముఖ్యమంత్రి జగన్. అంతకు ముందు ఈ మైదానంలో ఏర్పాటు చేసిన అమ్మ ఒడి, కంటి వెలుగు, జగనన్న గోరుముద్ద, వసతి దీవెన, మనబడి నాడు నేడు స్టాల్స్ ను పరిశీలించారు.. అలాగే జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీ వాణి, మంత్రులు మేకతోటి సుచరిత, బొత్స సత్యనారాయణ, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, అవంతి శ్రీనివాస్, శంకర నారాయణ, ఎం.పి.లు బెళ్లాన చంద్రశేఖర్, బొడ్డేటి మాధవి, ఎం వి వి సత్యనారాయణ, శాసన సభ్యులు, జిల్లా కలెక్టర్ డా ఎం హరి జవహర్ లాల్ తదితరులు పాల్గొన్నారు.



0 Comments