Economically Weaker Sections (EWS)
ఆర్థికంగా బలహీనమైన వర్గం లేదా విభాగం అంటే అగ్రవర్ణ కులాల్లో ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని EWS క్రింద గుర్తిస్తారు.EWS సర్టిఫికెట్ అంటే ఏమిటి ?
(ఆర్థికంగా వెనుకబడి ఉన్న వర్గాల వారికి)అగ్రవర్ణ కులాల్లో ఉన్న పేదలకు విద్య , ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తారు. దీనికోసం సర్టిఫికెట్ ఇస్తారు. దానినే EWS సర్టిఫికేట్ అంటారు.
అగ్రవర్ణ కులాల్లో ఉన్న పేదలు
రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ, వెలమ, నాయుడు, రాజులు, కమ్మ, మొదలగు తదితర ఓసి కులస్తులలో ఉన్న పేదలను EWS కింద పరిగణించి రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది.EWS సర్టిఫికెట్ వలన లాభం ఏమి?
1. విద్య అవకాశాల్లోనూ (College Seats)2. ఉద్యోగాల్లోనూ (Jobs)
10శాతం రిజర్వేషన్లు వీరికి కేటాయిస్తారు.
EWS సర్టిఫికెట్ పొందడానికి కావలసిన అర్హతలు
- అభ్యర్థి యొక్క మొత్తం కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ .8 లక్షల లోపు ఉండాలి.
- అతని కుటుంబానికి 5 ఎకరాల లోపు వ్యవసాయ భూమి ఉండాలి.
- నివాస ఫ్లాట్ ప్రాంతం 1000 చదరపు అడుగుల (sq ft) కంటే తక్కువగా ఉండాలి.
- నోటిఫైడ్ మున్సిపాలిటీ లో ఉంటే నివాస స్థలం 100 చదరపు గజాల(sq yards) కంటే తక్కువగా ఉండాలి.
- నోటిఫైడ్ కాని మునిసిపాలిటీ లో ఉంటే నివాస స్థలం 200 చదరపు గజాల (sq yards) కంటే తక్కువగా ఉండాలి.
EWS సర్టిఫికెట్ ఎక్కడ apply చేసుకోవాలి ?
మీసేవ లో ews సర్టిఫికేట్ కోసం అప్లికేషన్ లు ఉన్నాయి. లేదా కింద లింక్ ఉంది. అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి, మీసేవ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు అప్లై చేసుకోండి.పైన ఉన్న అర్హతలు ఆధారంగా మీకు EWS సర్టిఫికెట్ ను మంజూరు చేస్తారు.
మీరు కావాలంటే అప్లికేషన్ ను ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Click below to Download

0 Comments