నవరత్నాల్లో భాగమైన 'అమ్మ ఒడి' పథకం విధి, విధానాలపై విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అర్హులైన వారందరికీ.. లబ్ది చేకూరేలా ప్రభ్యుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అయితే 'అమ్మ ఒడి' పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం చివరి అవకాశం ఇచ్చింది. ఇప్పుటివరకు నమోదు చేసుకోనివారు ఎవరైనా ఉంటే.. వారు అందరూ కూడా జనవరి 5 వ తేదీ సాయంత్రం 5 గంటలోగా సంబంధిత అధికారులకు దరఖాస్తు సమర్పించాలని మంత్రి స్పష్టం చేశారు.
పథకం అమలు పట్ల ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో , పారదర్శకంగా అర్హుల ఎంపిక చేపడుతున్నారని వెల్లడించారు. అయితే ఇప్పుటికే 42,80,753 మందిని పథకానికి అర్హులుగా గుర్తించడం జరిగింది.
ప్రభుత్వం వారి కోసం రూ. 6,421 కోట్లను కేటాయించింది.
జనవరి 9న సీఎం జగన్ గారు చిత్తూరు జిల్లాలో 'అమ్మ ఒడి' పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా 1 వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే స్టూడెంట్స్ (విద్యార్థుల) తల్లుల (పర్యవేక్షకుల) బ్యాంకు ఖాతాల్లో ఏటా రూ.15 వేలు జమ చేయనుంది మన ప్రభుత్వం.


0 Comments