ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డ్ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. గతంలో కేవలం నామమాత్రంగా జరిగిన మానవ విలువలు, నైతికత, పర్యావరణ విద్య ఈ మూడు సబ్జెక్టులలో నిబంధనలను బోర్డు కఠినతరం చేసింది. ఇక నుంచి ఇంటర్ (ప్రథమ సంవత్సరం) ఫస్టియర్ విద్యార్థులు పబ్లిక్ పరీక్షల్లో నైతికత, మానవ విలువలు, పర్యావరణ విద్య ఈ సబ్జెక్టులలో కూడా తప్పనిసరిగా ఉత్తీర్ణులు అవ్వాలి. ఈ పరీక్షలలో పాస్ అవ్వకపోతే ఇంటర్ సెకండియర్ పూర్తయిన తరువాత మీకు ఇచ్చే ధ్రువీకరణ పతాన్ని బోర్డు జారీ చేయదు. ఇంటర్మీడియెట్ బోర్డు గతంలోనే ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు జనవరి నెల 28, 30 తేదీలలో ఈ రెండు పరీక్షలను నిర్వహించటం కొరకు షెడ్యూల్ ను విడుదల చేసింది.
షెడ్యూల్ ప్రకారం
28వ తేదీన నైతికత, మానవ విలువలు పరీక్షను ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.
30వ తేదీన, పర్యావరణ విద్య సబ్జెక్టును ఉదయం 10 గంటల నుండి ఒంటి గంట వరకు నిర్వహించనున్నారు.
100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో విద్యార్థులు కనీసం 35 మార్కులు సాధించాల్సి ఉంటుంది.
పాస్ మార్కులు 35.
ఒకవేళ గతంలో ఈ పరీక్షలకు
- హాజరు కాకపోయినా,
- హాజరైనప్పటికీ పాస్ అవ్వకపోయినా,
ఫస్టియర్ హాల్ టికెట్ నంబర్ తో వారు ఈ పరీక్షను రాయవచ్చు.
ఇంటర్మీడియెట్ బోర్డు ఆన్ లైన్ ప్రశ్నాపత్రాల ద్వారా నైతికత, మానవ విలువలు మరియు పర్యావరణ విద్య పరీక్షలను, ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహించనుంది. ఇంటర్మీడియెట్ బోర్డు ముద్రించిన ప్రశ్నాపత్రాలను పరీక్ష కేంద్రాలకు పంపే విధానానికి స్వస్తి పలికి పరీక్ష సమయానికి ముందు ఆన్ లైన్ లో ప్రశ్న పత్రాన్ని విడుదల చేయనుంది. ఇంటర్మీడియెట్ సెకండియర్ జనరల్ విద్యార్థులకు ఫిబ్రవరి 1వ తేదీ నుండి ఫిబ్రవరి 20వ తేదీ వరకు నాలుగు దశల్లో పరీక్షలు జరగనున్నాయి.
జంబ్లింగ్ పద్దతిలో ఈ ప్రాక్టికల్ పరీక్షలకు కేంద్రాలను కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది.
మీరు official website ద్వారా ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
హాల్ టికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Click here to download Hall tickets.


0 Comments