2020 లో క్రికెట్ పూర్తి షెడ్యూల్ ఇదే || 2020 cricket Schedule one-day, world cup, under 19

కొత్త సంవత్సరం 2020 రానే వచ్చింది. ఈ సంవత్సరం ఆటల పోటీలు వరుస కడుతాయి. నిజం... ఈ యేడు ఏ ఒకటీ తక్కువ కాదు. ప్రతి ఒక్కటీ విలువైందే! మహిళల క్రికెట్‌ మెరుపులు, ఐపీఎల్‌ ఉరుములు పొట్టి క్రికెట్‌ను ముంచెత్తనున్నాయి. ఈ వరుసలో నేనున్నానంటూ యూరో టోర్నీ ‘సాకర్‌ కిక్‌’కు రెడీ అంటుంది. ఆ వెంటే ఆటగాళ్ల ఒలింపిక్స్‌ సమరం టోక్యోలో మొదలవుతుంది. ప్రపంచమంతా ఒలింపిక్స్‌ ఫీవర్‌లో తడిసిముద్దయ్యాక... ఆసీస్‌లో పురుషుల టి20 ప్రపంచకప్‌ వేట షురూ అవుతుంది. వీటికి తోడుగా బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌ టోర్నీలు... టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలు... రయ్‌ రయ్‌ మంటూ సాగే ఫార్ములావన్‌ రేసులు... దీంతోనే అంతా అయిపోలేదు. ఇంకెన్నో లీగ్‌లున్నాయి. ప్రీమియర్‌   బ్యాడ్మింటన్‌ లీగ్‌ ‘షటిల్స్‌’... ప్రొ కబడ్డీ కూతలు...   ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ ఫుట్‌బాల్‌ ‘ఫ్రీకిక్స్‌’ 2020ని అసాంతం అటాడుకుంటాయి.


క్రికెట్:
►జనవరి 5: భారత్‌: శ్రీలంక; తొలి టి20 (గువాహటి) 
►జనవరి 7: భారత్‌: శ్రీలంక; రెండో టి20 (ఇండోర్‌) 
►జనవరి 10: భారత్‌: శ్రీలంక; మూడో టి20 (పుణే) 
►జనవరి 14: భారత్‌: ఆస్ట్రేలియా; తొలి వన్డే (ముంబై) 
►జనవరి 17: భారత్‌: ఆస్ట్రేలియా; రెండో వన్డే (రాజ్‌కోట్‌) 
►జనవరి 19: భారత్‌: ఆస్ట్రేలియా; మూడో వన్డే (బెంగళూరు) 
►జనవరి 24: భారత్‌: న్యూజిలాండ్‌; తొలి టి20 (ఆక్లాండ్‌) 
►జనవరి 26: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో టి20 (ఆక్లాండ్‌) 
►జనవరి 29: భారత్‌: న్యూజిలాండ్‌; మూడో టి20 (హామిల్టన్‌) 
►జనవరి 31: భారత్‌: న్యూజిలాండ్‌; నాలుగో టి20 (వెల్లింగ్టన్‌) 
►ఫిబ్రవరి 2: భారత్‌: న్యూజిలాండ్‌; ఐదో టి20 (మౌంట్‌ మాంగనీ) 
►ఫిబ్రవరి 5: భారత్‌: న్యూజిలాండ్‌; తొలి వన్డే (హామిల్టన్‌) 
►ఫిబ్రవరి 8: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో వన్డే (ఆక్లాండ్‌) 
►ఫిబ్రవరి 11: భారత్‌: న్యూజిలాండ్‌; మూడో వన్డే (మౌంట్‌ మాంగనీ) 
►ఫిబ్రవరి 21–25: భార: న్యూజిలాండ్‌; తొలి టెస్టు (వెల్లింగ్టన్‌) 
►ఫిబ్రవరి 29–మార్చి 4: భారత్‌: న్యూజిలాండ్‌; రెండో టెస్టు (క్రైస్ట్‌చర్చ్‌) 
►మార్చి 12: భారత్‌: దక్షిణాఫ్రికా; తొలి టి20 (ధర్మశాల) 
►మార్చి 15: భారత్‌: దక్షిణాఫ్రికా; రెండో టి20 (లక్నో) 
►మార్చి 18: భారత్‌: దక్షిణాఫ్రికా; మూడో టి20 (కోల్‌కతా) 
►ఏప్రిల్‌–మే: ఐపీఎల్‌ 
►జూన్‌–జూలై: శ్రీలంకలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు, 3 టి20లు) 
►ఆగస్టు: జింబాబ్వేలో భారత జట్టు పర్యటన (3 వన్డేలు) 
►సెప్టెంబర్‌: ఆసియా కప్‌ టోర్నీ 
►సెప్టెంబర్‌–అక్టోబర్‌: భారత్‌లో ఇంగ్లండ్‌ జట్టు పర్యటన (3 వన్డేలు, 2 టి20లు) 
►అక్టోబర్‌–జనవరి 2021: ఆస్ట్రేలియాలో భారత జట్టు పర్యటన (3 టి20లు, 3 వన్డేలు, 4 టెస్టులు) 


పురుషుల టి20 వరల్డ్‌ కప్‌:
అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 
వేదిక: ఆస్ట్రేలియా

అండర్‌–19 వరల్డ్‌కప్‌ క్రికెట్‌
జనవరి 17 నుంచి ఫిబ్రవరి 9 వరకు
వేదిక: దక్షిణాఫ్రికా

మహిళల టి20 వరల్డ్‌ కప్‌
అక్టోబర్‌ 18 నుంచి నవంబర్‌ 15 
వేదిక: ఆస్ట్రేలియా

Post a Comment

0 Comments