Andhra Pradesh Jobs: వచ్చే నెలలో 7900 పోస్టులతో మెగా డీఎస్సీ... ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులపై వరాల వర్షం కురుస్తోంది. ఇప్పటికే గ్రామవాలంటీర్, వార్డ్ వాలంటీర్, గ్రామ సచివాలయ ఉద్యోగాలతో పాటు అంగన్వాడీ, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది. దీంతో నిరుద్యోగులకు వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వచ్చే నెలలో అంటే... 2020 జనవరిలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మెగా డీఎస్సీ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రకటించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే నెలలో మెగా డీఎస్సీ నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
అది కూడా ఏకంగా 7900 పోస్టులతో డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు మరో పండగే.
ఎప్పటి నుంచో డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ ఉపాధ్యాయులకు ఇది ఎంతో సంతోషకరమైన వార్తని చెప్పాలి.


0 Comments