దేశవ్యాప్తంగా డాక్టర్ దిశ హత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దిశ హత్య కేసులో నిందితులు చెప్పిన విషయాలు విని షాక్ అవ్వడం పోలీసుల వంతయింది. పోలీసుల విచారణలో నిందితులు దిశపై అత్యాచారం, హత్య చేసే సమయంలో తాగి ఉన్నామని ఏం చేస్తున్నామో అనే విచక్షణ కూడా లేదని లారీలో కూర్చొని విసుగు పుట్టి యువతి కనపడగానే ఏదో ఒకటి చేయాలనుకున్నామని చెప్పారు.
నిందితులు దిశ ఎంత ఆలస్యంగా వస్తే తమ పని అంత తేలిక అవుతుందని భావించామని పోలీసులకు చెప్పారు. దిశను చంపేసి కాల్చేస్తే తమకేమీ కాదని అనుకున్నామని ఇంత దూరం వస్తుందనుకోలేదు అని నిందితులు చెప్పటంతో పోలీసులు కంగుతిన్నారు. ఐరన్ రాడ్ల లోడ్ తో రాయచూర్ వెళ్లిన అరీఫ్, శివ , నవీన్, చెన్నకేశవులు లోడ్ డెలివరీ చేయక ముందు కొన్ని ఐరన్ రాడ్లను దొంగలించి ఒకచోట దాచిపెట్టి లోడ్ డెలివరీ చేశారు.
చోరీ చేసిన ఐరన్ రాడ్లను 4 వేల రూపాయలకు విక్రయించి వచ్చిన డబ్బులతో మద్యం కొనుగోలు చేశారు. మద్యం తాగిన తరువాత 6 గంటల సమయంలో దిశ స్కూటీని పార్క్ చేయడం చూసిన నిందితులు ప్లాన్ వేసి ప్లాన్ ప్రకారం అత్యాచారం, హత్య చేశారు. నలుగురు నిందితులపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసులు మోపిన అభియోగాలు న్యాయస్థానంలో నిజమైతే మాత్రం నిందితులకు మరణ శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దిశ కేసును వేగంగా విచారించి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా కేసు విచారణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దిశ కుటుంబానికి అవసరమైన అన్ని సహాయక చర్యలను చేపట్టటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. సీఎం కేసీఆర్ మానవ మృగాలు మన మధ్యే తిరుగుతున్నాయని అన్నారు.
తెలంగాణాలో మహిళా డాక్టర్ పై హత్యాచారానికి సంబంధించి ఒళ్ళు గగుర్పొడిచే షాకింగ్ డీటెయిల్స్ వెల్లడయ్యాయి. 26 ఏళ్ళ ఆమెపై శంషాబాద్ ప్రాంతంలో నలుగురు మృగాళ్లు అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హతమార్చి డెడ్ బాడీని పెట్రోలుతో కాల్చివేశారు. ఈ నలుగురినీ శుక్రవారం సాయంత్రం సైబరాబాద్ పోలీసులు వారి ఇళ్ల నుంచి అరెస్టు చేశారు. మేజిస్ట్రేట్ వీరికి 14 రోజుల జ్యూడిషియల్ కస్టడీ విధించగా.. వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. తమ కుమార్తె మిస్సింగ్ ఉదంతం పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన మృతురాలి కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన ముగ్గురు పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ ఘటనకు సంబంధించి ఆదివారం సైబరాబాద్ పోలీసులు రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు.
హైదరాబాద్-బెంగుళూరు జాతీయ రహదారిపై చటాన్ పల్లి వద్ద ఓ కల్వర్టు కింద కాలిపోయిన స్థితిలో బాధితురాలి మృత దేహాన్ని కనుగొన్నట్టు వారు పేర్కొన్నారు.

మరో నిర్భయ ఘటనగా ఈ దారుణం దేశవ్యాప్త నిరసనలకు కారణమైంది. రిమాండ్ రిపోర్ట్ ప్రకారం.. నవంబర్ 27 రాత్రి, నవంబరు 28 ఉదయం వరుసగా జరిగిన ఘటనలను ప్రస్తావించారు. మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చింతకుంట చెన్నకేశవులు అనే మృగాళ్లు ప్రస్తుతం చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. పాతికేళ్ల లారీ డ్రైవర్ మహమ్మద్ ఆరిఫ్ ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్నాడు. ఇతగాడు 10 వ తరగతి వరకు చదివాడు. కూకట్ పల్లిలో 2012 నుంచి 2015 వరకు ఆటో డ్రైవర్ గా, 2017 నుంచి లారీ డ్రైవరుగా పని చేస్తున్నాడు.
నవంబర్ 27 సాయంత్రం అయిదున్నర గంటలకు ఆరిఫ్ మద్యం బాటిల్స్ కొన్నాడు. శంషాబాద్ పీఎస్ వద్ద ఈ నలుగురూ కూర్చుని పీకల దాకా మద్యం తాగారు. 6 గంటల ప్రాంతంలో ఒక మహిళ తన స్కూటీని ఒక లారీ పక్కన పార్క్ చేసి దగ్గర్లోనే ఉన్న క్లినిక్ కి వెళ్లడం చూశారు. దాంతో ఆమెపై వారు కన్నేశారు. నవీన్ ఆమె స్కూటీ కి పంక్చర్ చేశాడు. రాత్రి 9 గంటలకు ఆరిఫ్, మరో ముగ్గురు తమ లారీని ఈమె స్కూటీకి ముందు సుమారు అయిదు కి. మీ. దూరంలో తొండవల్లి జంక్షన్ వద్ద నిలిపారు.
రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిముషాల ప్రాంతంలో వైద్యురాలు తన స్కూటీని తీసుకునేందుకు రాగా.. దాని వెనుక టైర్ పంక్చర్ అయి ఉండడం చూసింది.

9.30 గంటలకు శివ తాను సాయం చేస్తానంటూ ఆ వాహనాన్ని తీసుకువెళ్లాడు. అయితే కొద్ది సేపటికి తిరిగి వఛ్చి వాహనాల రిపేరు షాపులన్నీ మూసివేసి ఉన్నాయని చెప్పాడు. ఆ తరువాత నలుగురూ ఆమెను లారీ వెనుక నిర్మానుష్య ప్రదేశానికి లాక్కు వెళ్లారు. నవీన్ ఆమె నోట్లో బలవంతంగా మద్యం పోశాడు. ఆ తరువాత నలుగురూ గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. స్పృహ కోల్పోయిన ఆమె కాసేపటికి స్పృహలోకి వఛ్చి కేకలు పెట్టబోగా నిందితులు ఆమె నోరు మూసి హత మార్చారు. అనంతరం మృత దేహాన్ని లారీలోకి ఎక్కించి కొద్ది దూరంలో పెట్రోలు పోసి దహనం చేశారు. కాగా-ఈ మృగాళ్లను వదలరాదని, బహిరంగంగా ఉరి తీయాలన్న డిమాండ్లు దేశవ్యాప్తంగా వినవస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీలవరకు ముక్త కంఠంతో ఇదే కోరుతున్నారు. శంషాబాద్ పోలీసు స్టేషన్ వద్ద మొదలైన ఉద్రిక్తత… నిందితులను తరలించిన చర్లపల్లి జైలు వద్ద కూడా కొనసాగింది. ఆందోళనకారులు పోలీసులపై చెప్పులు విసిరిన ఘటనే ఇందుకు నిదర్శనం.
0 Comments