ISRO Recruitment 2019 – Apply Online for 327 Scientist/Engineer posts
పోస్టుల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేసింది.దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 15న ప్రారంభమైంది.దరఖాస్తుకు నవంబర్ 4 చివరి తేదీ.
ఇస్రోలో శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా ? ఇదిగో నోటిఫికేషన్
ఇస్రోలో ఉద్యోగాలకు ఇటీవల వరుసగా నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ... ఇస్రో పేరు వినగానే చంద్రయాన్ లాంటి ప్రయోగాలు గుర్తొస్తాయి.ఆ ప్రయోగాల వెనుక వేలాది మంది శాస్త్రవేత్తల కృషి ఉంది. మీరూ అలాంటి శాస్త్రవేత్త కావాలనుకుంటున్నారా? మీకు అవకాశం కల్పిస్తోంది భారత అంతరిక్ష పరిశోధన సంస్థ-ISRO.ఇస్రో సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంజినీరింగ్ డిగ్రీ అర్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.అభ్యర్థులు నిర్ణీత మొత్తంతో దరఖాస్తు ఫీజు చెల్లించి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.ఇప్పుడు మరో 327 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.సైంటిస్ట్ / ఇంజనీర్,ఎలక్ట్రానిక్స్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ లాంటి విభాగాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది isro.
మరిన్ని వివరాల కోసం https://www.isro.gov.in/ వెబ్‌సైట్ ఫాలో కావాలి. ఇస్రో జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


0 Comments