జియో నుంచి దిమ్మ తిరిగిపోయే ఆఫర్లు I JIO fibernet Offers


  • ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో ప్రాతిపదికన కొత్త సినిమాలు చూసే అవకాశం
  • వెల్‌ కం ప్లాన్‌ కింద కస్టమర్లకు 4కే ఎల్‌డీ టీవీ, 4జీ హెచ్‌డీ సెట్‌టాప్‌బాక్స్‌ పూర్తిగా ఉచితం
  • సె‍‍ప్టెంబర్‌ 5 నుంని జియో ఫైబర్‌ సేవలు ఆరంభం
  • రూ.700 నుంచి  10వేల మధ్య టారిఫ్ 
  • క్లౌడ్‌ కంప్యూటింగ్‌లో మైక్రోసాఫ్ట్‌తో జత
jio fiber net


రిలయన్స్‌  అధినేత, సీంఎడీ ముకేశ్‌ అంబానీ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌  42వ వార్షిక  సమావేశంలో   మరోసారి సంచలనం సృష్టించారు.  జియో గిగా ఫైబర్‌ సేవలతో  ఎవరూ ఊహించనంత   ఎక్కువగా ఆఫర్లను ప్రకటించారు.. అతి తక్కువ ధరకే ఫైబర్‌ సేవలను తమ  వినియోగదారులకు టెలికాం రంగంలో జియో లాగానే   అందుబాటులో తీసుకొస్తున్నాము  అన్నారు.  


జియో 3వ  వార్షికోత్సవం సందర్భంగా : 


  •  దేశవ్యాప్తంగా జియో ఫైబర్‌ సేవలను ఈ  సెప్టెంబర్‌ 5 నుంచి అందుబాటులోకి తెస్తామని ప్రకటించారు. 
  • వెల్‌ కం ప్లాన్‌ కింద కస్టమర్లకు 4కే ఎల్‌డీ టీవీ, 4జీ హెచ్‌డీ సెట్‌టాప్‌బాక్స్‌ పూర్తిగా ఉచితం
  • అలాగే 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీ పీఎస్‌ వరకు డేటా ఉచితం. 
  • తద్వారా 5 లక్షల కుటుంబాలకు ఉచిత ఫైబర్‌ సేవలు అందుబాటు  
  • జియో ఫైబర్ సబ్‌స్క్రైబర్స్‌కు   ల్యాండ్‌ లైన్‌ ద్వారా ఇంటి నుంచి అన్‌లిమిటెడ్‌ వాయిస్ కాల్స్
  • రూ.500 లకే అమెరికా, కెనడాకు అన్‌లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. 

 అలాగే  ప్రీమియం కస్టమర్లు ఇంటివద్దే ఫస్ట్ డే ఫస్ట్ షో  ప్రాతిపదికన కొత్త సినిమాలు  చూసే అవకాశం కల్పిస్తామన్నారు.

 పూర్తి వివరాలు jio.com లో  సెప్టెంబరు 5నుంచి అదుబాటులో ఉంచుతాము అని తెలిపారు. రానున్న 12 నెలల్లో జియో ఫైబర్ భారీగా విస్తరించబోతుంది అని రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ వెల్లడించారు., బ్రాడ్‌బాండ్ సిగ్నల్ వచ్చేలా సెట్‌టాప్ బాక్స్‌ను సిద్ధం చేశారు. మైక్రోసాఫ్ట్‌తో జత కట్టి  జియో ఫైబర్‌నెట్‌ ద్వారా ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ క్లౌడ్ కనెక్టివిటీ అందజేస్తామని వెల్లడించారు. ఇందుకోసం మైక్రోసాఫ్ట్‌తో జత కట్టినట్టు తెలిపారు.

ఈ కార్యక్రమంలో  రిలయన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ కుమార్తె-ఈశా, మరియు  కుమారుడు- ఆకాశ్‌ జియో ఫైబర్‌  గురించి సంచలనమైన  వివరాలను వివరిస్తూ  వేదికపై  అలరించారు. ముఖ్యంగా జియోతో హై-ఎండ్-వీడియో-కాన్ఫెరెన్స్  ఎలా చేయగలమో లైవ్‌గా చేసి అందరిని ఆనందంలో తేల్చారు  ఇషా మరియు ఆమె సోదరుడు ఆకాశ్ అంబానీ.  ఆకాశ్ అంబానీ గారు మాట్లాడుతూ..మన ఇంట్లో ఉన్న టీవీ స్క్రీన్ల పైనే వీడియో కాలింగ్‌ ద్వారా ఒకేసారి నలుగురితో మాట్లాడవచ్చో లైవ్ గా చేసి  ప్రదర్శించారు.  ప్రపంచంలో ఏ అంచులో ఉన్న వారితోనైనా వీడియో కాలింగ్‌, కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుకోవచ్చని వివరించారు. మల్టీ ప్లేయర్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభిస్తున్నామని చెప్పారు. గిగా ఫైబర్‌లో ఉండే ఏఆర్, వీఆర్ తో లైవ్ షాపింగ్  అనుభవాన్ని పొందవచ్చన్నారు. ఇంటి వద్దనుంచే  మనకు సరిపడే దుస్తులను ఎంచుకొని  షాపింగ్  చేయవచ్చని చెప్పారు.  అంతేకాకుండా మన  ఇంట్లో థియేటర్‌ అనుభవాన్ని పొందవచ్చు అని, ఎలా పొందవచ్చో కూడా చేసి  చూపించారు. జియో  సీఈవో కిరణ్‌ కూడా ఈ సమావేశంలో మాట్లాడారు. 

Post a Comment

0 Comments