AP POLYCET Results 2023: ఈ నెల 20న ఏపీ పాలిసెట్ ఫలితాలు.. రిజల్ట్స్ లింక్ ఇదే..

ఏపీలో ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలకు సంబంధించిన ఫలితాలను తాజాగా విడుదల చేశారు.

Download rank card: Click here



ఏపీలో ఈ నెల 10వ తేదీన పాలిటెక్నిక్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలిసెట్-2023)ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,43,625 మంది అభ్యర్థులు హాజరయ్యారు. అయితే.. ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఫలితాల విడుదల తేదీని అధికారులు తాజాగా ప్రకటించారు. ఈ ఫలితాలను ఈ నెల 20న విడుదల చేయనున్నారు. ఈ మేరకు రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణా మండలి చైర్మన్ చదలవాడ నాగరాణి ప్రకటించారు. పాలిటెక్నిక్ ప్రవేశాలకు సంబంధించిన వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ను సైతం అదే రోజు ప్రకటిస్తామని తెలిపారు.

ఫలితాల విడుదల తర్వాత పరీక్ష రాసిన అభ్యర్థులు.. ఫలితాలను, ర్యాంకుల వివరాలను https://polycetap.nic.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70వేల 569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

పాలీసెట్ లో అభ్యర్థులు సాధించిన ప్రతిభ ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు. పాలిసెట్‌ ద్వారా ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడేళ్లు, మూడున్నరేళ్ల కాలవ్యవధి గల డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనున్నారు.

Polytechnic complete details video:





Post a Comment

0 Comments