AP Yuvanestham nirudyoga bruthi || latest news AP nirudyoga bruthi

భృతి ఇక లేనట్లేనా..! 



2014 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఇంటికో ఉద్యోగం, లేకపోతె 1000 రూపాయల నిరుద్యోగభృతి ఇస్తామని అలాగే జాబు రావాలంటే బాబు రావాలి అనే ఎన్నికల హామీతో అధికారంలోకి వచ్చి, చివరగా ఇక ఎన్నికలు వస్తాయి అనగా ముఖ్యమంత్రి యువనేస్త0 నిరుద్యోగభృతి పథకం ప్రారంభించింది. 2019 సంవత్సరం మర్చి నెల నుండి వెయ్యి రూపాయల నిరుద్యోగభృతిని కాస్తా 2,000 రూపాయలకు పెంచారు. ఈ నిరుద్యోగభృతి పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 5 లక్షల మంది నిరుద్యోగులు లబ్ది పొందారు. 
    ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు 2019 జూన్ నెల నుండి ఏ ఒక్క నిరుద్యోగి అకౌంట్ లో నిరుద్యోగ భృతి అనేది జమ కాలేదు. దాంతో ఈ పథకం రద్దు అయింది అని వార్తలు వచ్చాయి. 
                   గత రెండు రోజులుగా జరిగిన Ap బడ్జెట్ సమావేశాల్లో ఈ నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావించలేదు. కనుక ఇక నుంచి భృతి రాదు అని చెప్పవచ్చు. కానీ నిరుద్యోగులకు ఇది చాలా బాధాకరమైన వార్త..
           మన AP ప్రభుత్వం ఇలా చేస్తుంది అని ఎవరూ ఊహించలేదు..  అలాగే ఇన్ని పథకాలు ప్రవేశపెడుతున్న మన నూతన ముఖ్యమంత్రి YS జగన్ గారు, ఇది కూడా కొనసాగిస్తారు అనే అనుకున్నాం అందరం.. కానీ ఇక నిరుద్యోగ భృతి లేనట్లు అర్థమైంది..

            నిరుద్యోగులకు అండగా నిలవాలి అనుకుంటే జగన్ గారు భృతి ఇస్తారు.. నిరుద్యోగులందరూ భృతి కోసం ఎదురుచూస్తున్నారు.. మరి నిరుద్యోగుల బాధలు, కష్టాలు అర్థం చేసుకుంటే మళ్ళీ మనందరికీ భృతి అందుతుంది.. 
        నిరుద్యోగులకు అండగా నిలబడి, భృతి ఇస్తారని ఆశిద్దాం.... సోషల్ మీడియా ద్వారా భృతి , దాని అవసరాలు గురించి షేర్ చేయండి.. జగన్ గారికి చేరే వరకు, భృతి ఇచ్చే వరకు...
         
                                                 మీతోనే.   నేను....!

Post a Comment

0 Comments